News January 1, 2025
MDK: ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. మీ ఇంటికి వచ్చారా..?
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.
Similar News
News January 25, 2025
రేపు మాంసం దుకాణాలు బంద్: కమిషనర్
రేపు రామాయంపేట మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు జరపొద్దని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. చికెన్, మటన్, చేపల మార్కెట్లు మూసివేయాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయాలు బంద్ ఉండనున్నాయి.
News January 25, 2025
రామాయంపేట: గిరిజన యువకుడికి 2 ప్రభుత్వ ఉద్యోగాలు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన గిరిజన విద్యార్థి జవహర్ లాల్ నాయక్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల ప్రకటించిన సెంట్రల్ వాటర్ కమిషన్‌లో జూనియర్ ఇంజినీర్‌గా సెలెక్ట్ కాగా, శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రకటించిన నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. తమ తండాకు చెందిన యువకుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.
News January 25, 2025
MDK: తగ్గిన ఎయిర్టెల్ సిగ్నల్
ఎయిర్టెల్ సిమ్ము వినియోగదారులకు గత కొన్ని రోజుల నుంచి సిగ్నల్ సరిగా అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్టెల్ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఒక సైట్ ఓపెన్ కావడానికి 1 నిమిషం వరకు పడుతోందని యువకులు అంటున్నారు. airtel సిబ్బంది స్పందించలన్నారు.