News July 12, 2024
MDK: ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ లక్షలు కాజేసింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న విషయాన్ని తెలుసుకుంది. స్టాఫ్ నర్సు, క్లర్క్ జాబ్ అంటూ నమ్మించి 28 మంది నుంచి రూ.2 లక్షల చొప్పున వసులు చేసి ఫోర్జరీ సంతకాలతో నకిలీ జాబ్ ఆర్డర్లు ఇచ్చింది. పోస్టింగ్ ఆర్డర్లు తీసుకొని ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం బయట పడింది.
Similar News
News February 12, 2025
మెదక్: అప్పులతోనే ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య

మెదక్ పట్టణంలో ప్రముఖ వ్యాపారి మల్లికార్జున రమేష్ (54) మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రమేశ్ పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఈ సూపర్ మార్కెట్ ద్వారా 100 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో అప్పులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. వాటిని తీర్చే మార్గం లేక ఇంటిపై గల పెంట్ హౌస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
News February 12, 2025
మెదక్: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
నర్సాపూర్: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో దులానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.