News July 23, 2024
MDK: కన్నీరు తెప్పిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. <<13690444>>నచ్చిన చదువు చదవలేదు<<>>. నచ్చిన బట్టలు, ఇష్టమైన తిండి తినలేదు. నచ్చిన జాబ్ కూడా లేదు. నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నాను. గుడ్ బై’ అంటూ మధ్యతరగతి యువత కష్టాలను లెటర్లో రాసి తనువు చాలించాడు.
Similar News
News October 29, 2025
మెదక్: అమరుడికి నివాళులర్పించిన అదనపు ఎస్పీ

మెదక్ పట్టణం జంబికుంటలో నివాసం ఉంటున్న అమరుడు ఆబేద్ హుస్సేన్ కుటుంబాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఈరోజు పరామర్శించారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ పై బాంబు దాడిలో మృతిచెందిన ఆబేద్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మహేందర్ హామీ ఇచ్చారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేశ్ పాల్గొన్నారు.
News October 29, 2025
మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఏర్పాటుకు కృషి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో మెదక్ జిల్లాలోనూ వీటి ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,617 చెరువులు, 105 చెక్ డ్యాములు, మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. 2 లక్షల 67 వేల ఎకరాల సాగుభూమి ఉంది, వీటికి సంఘాలు ఏర్పాటు చేయడంతో చెరువుల సంరక్షణ, సాగునీటి పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు రాజకీయ నిరుద్యోగులు సైతం తగ్గిపోయే అవకాశం ఉంది.
News October 28, 2025
మెదక్ జిల్లాకు కొత్తగా ఏడుగురు ఎంపీడీవోలు

మెదక్ జిల్లాకు కొత్తగా ఏడుగురు ఎంపీడీవోలు నియామకం అయ్యారు. జెడ్పీలో రిపోర్ట్ చేసిన అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిశారు. కొత్తగా కేటాయించిన వారు ఎంపీడీఓలుగా తూప్రాన్-శాలిక తేలు, నార్సింగి-ప్రీతి రెడ్డి, హవేలీఘన్పూర్-
వలుస శ్రేయంత్, చిలిపిచేడ్- బానోత్ ప్రవీణ్, అల్లాదుర్గ్- వేద ప్రకాశ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సీఈఓ ఎల్లయ్య ఉన్నారు.


