News March 25, 2024

MDK: కలర్ పడుద్ది.. కళ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు ఈ వేడుక జరుపుకొనేందుకు ఉమ్మడి మెదక్ ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

Similar News

News November 28, 2025

మెదక్: తాత్కాలికంగా ప్రజావాణి వాయిదా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం తెలిపారు. హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరించబడునున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News November 28, 2025

MDK: రెండో రోజు 152 సర్పంచ్, 186 వార్డు నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు 152, వార్డు సభ్యుల స్థానాలకు 186 నామినేషన్లు వచ్చాయి. అల్లదుర్గ్ 14, హవేలీఘనపూర్ 49, పాపన్నపేట్ 25, రేగోడు 18, శంకరంపేట్(ఏ) 17, టేక్మాల్ 29 సర్పంచ్ నామినేషన్లు స్వీకరించారు. వివరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.

News November 28, 2025

MDK: గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం కీలక సమీక్ష జరిగింది. కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌తో పాటు డీపీఓ, జడ్పీ సీఈఓ పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, పర్యవేక్షణ, అమలు చర్యలను వివరంగా పరిశీలించిన కలెక్టర్, ప్రతి దశలో క్రమశిక్షణ, సమన్వయం, పారదర్శకతను పాటించాలని అధికారులకు సూచించారు.