News March 25, 2024
MDK: కలర్ పడుద్ది.. కళ్లు భద్రం..!

హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు ఈ వేడుక జరుపుకొనేందుకు ఉమ్మడి మెదక్ ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.
Similar News
News July 11, 2025
MDK: ‘చదువుకోసం సైకిల్ తొక్కుతాం’

చదువు కోసం సైకిల్ తొక్కుతామని మెదక్ మండలంలోని ర్యాలమడుగు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు అన్నారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు తమ గ్రామానికి సుమారు 2 KM దూరంలో ఉన్న మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ప్రతిరోజూ సైకిల్ పై పాఠశాలకు వెళ్లివస్తుంటారు. ఆటోలో వెళ్లాలంటే డబ్బులు కావాలని, చదువు కోసం కష్టమైనా సైకిల్ పైనే వెళ్తామన్నారు.
News July 11, 2025
మెదక్: ఢిల్లీ నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్

ఢిల్లీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ పై జరిగిన నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో అమలవుతున్న నూతన కార్యక్రమాలు, పోషణ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాల గురించి వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News July 11, 2025
మెదక్: ఆపరేషన్ ముస్కాన్.. 8 కేసులు నమోదు: ఎస్పీ

ఆపరేషన్ ముస్కాన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల వద్ద పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తామన్నారు.