News September 30, 2024

MDK: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
మెదక్: 2720 136 1:20
సంగారెడ్డి: 3352 234 1:14
సిద్దిపేట: 3246 157 1:20

Similar News

News October 7, 2024

మెదక్: ‘ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

image

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలువురు దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, దరఖాస్తు దారులు, తదితరులు పాల్గొన్నారు.

News October 7, 2024

మెదక్: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు

image

మెదక్ జిల్లాలోని ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు ఈనెల 31 వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యలో చదువు ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం స్థానికంగా ఉండే ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో సంప్రదించాలన్నారు.

News October 7, 2024

గజ్వేల్‌లో కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం

image

గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. నియోజకవర్గంలో చాలా రోజులుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఎంసీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. చెక్కుల పంపిణీ చేయాలని సహకారం ఇవ్వాలని కోరుతూ.. కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చారు. వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భాస్కర్ తదితరులు ఉన్నారు.