News September 9, 2024
MDK: క్విజ్లో గెలిస్తే రూ.10లక్షలు

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం 71 కళాశాలలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.
Similar News
News November 20, 2025
మెదక్: వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు.
News November 20, 2025
మెదక్: ‘దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలి’

జిల్లాలో ఎంపికైన దివ్యాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు గురువారం వినతిపత్రం సమర్పించారు. సహాయ పరికరాలు పంపిణీ కోసం గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, 7920 మంది లబ్ధిదారులు 16 రకాల పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం సహాయ పరికరాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
News November 20, 2025
మెదక్: ‘కల్లుగీత కార్మికులకు హామీలు నెరవేర్చాలి’

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్లో గురువారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.


