News September 9, 2024
MDK: క్విజ్‌లో గెలిస్తే రూ.10లక్షలు
RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం 71 కళాశాలలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.
Similar News
News October 5, 2024
సిద్దిపేట: కాసేపట్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
కొద్ది గంటల్లో కుమారుడి పెళ్లి జరగనుండగా అంతలోనే జరిగిన ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటన తొగుట మండలం వెంకట్రావుపేట వద్ద తెల్లవారుజామున జరిగింది. రాయపోల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసిం(మాజీ వీఆర్ఏ) కుమారుడు నిజాముద్దీన్ వివాహం ఈరోజు జరగాల్సి ఉంది. భార్య సాహెరా, మరో కుమారుడు వసీయోద్దీన్‌తో కారులో వస్తుండగా వెంకట్రావుపేట వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
News October 5, 2024
సంగారెడ్డి: ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకోండి !
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 15లోగా ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకునేలా ఉపాద్యాయులు కృషి చేయాలని కోరారు.
News October 5, 2024
వెంకట స్వామికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం
ట్యాంకు బండ్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకట్ స్వామి జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని వెంకట స్వామి విగ్రహానికి ఎమ్మేల్యేలు వివేక్, వినోద్‌తో కలిపి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నైతిక విలువలను, ప్రజా స్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకట్ స్వామి అని కొనియాడారు.