News May 24, 2024

MDK: గాలివాన బీభత్సం 

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. గాలివాన బీభత్సం సృష్టించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏడుపాయల సమీపంలోని పాపన్నపేట మండలం అబులాపూర్‌ గ్రామంలో సంగమేశ్ అనే వ్యక్తికి చెందిన రేకుల ఇల్లు ఈదురు గాలులకు ధ్వంసమైంది. రేకులు ఎగిరిపోయి, గోడలు కూలిపోవడంతో బాధితుడు వాపోతున్నాడు. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా కామెంట్ చేయండి.

Similar News

News February 18, 2025

మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

image

11వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ బాయ్స్, గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలకు హవేలి ఘనపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం కరుణాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన నవీన్, ప్రకాష్ సింగ్, రోహిత్ గౌడ్‌లు రన్నింగ్, షాట్ ఫుట్ విభాగాల్లో ఎంపికయ్యారని అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నేడు మంగళవారం జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను అభినందించారు.

News February 17, 2025

మెదక్: రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు

image

నూతనంగా నియామకమైన పోలీస్ సిబ్బందికి రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలలో పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.

News February 17, 2025

మెదక్: ప్రజల సమస్యలను పరిష్కరించాలి: ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు త్వరగా పరిశీలించాలని సూచించారు.

error: Content is protected !!