News March 6, 2025
MDK: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.
Similar News
News December 14, 2025
TTD నిధులతో SV జూ అభివృద్ధి

తిరుపతిలోని SV జూలాజికల్ పార్క్ అభివృద్ధికి టీటీడీ నుంచి రూ.97 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జంతువుల భద్రత, సందర్శకుల సౌకర్యాల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. బోర్డు తీర్మానం 474కి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
News December 14, 2025
క్రమశిక్షణ గల పౌరులను అందించే పరిశ్రమ ఏయూ: గంటా

ఆంధ్రా యూనివర్సిటీ నైతిక విలువలు, క్రమశిక్షణ గల భావి పౌరులను తయారు చేసే పరిశ్రమ అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయూ అనేక మంది నాయకులు, క్రీడాకారులు, ప్రతిభావంతులను దేశానికి అందించిందన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
News December 13, 2025
KMR: 16 ప్రదేశాల్లో ఆరెంజ్, 16 ఎల్లో అలర్ట్

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత స్థిరంగా ఉంది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా 16 ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 10°Cలోపు ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా 16 ప్రదేశాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. 15°C లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలోని అన్ని ప్రదేశాలు చలి గుప్పిట్లో బందిలయ్యి ఉన్నాయి. ప్రజలు తమ పనులకు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.


