News May 20, 2024

MDK: గ్రామాల్లో పడకేసిన పాలన.. ఆగిన పారిశుద్ధ్య పనులు

image

పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతలో అలరారిన గ్రామాలు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లె పాలన పడకేసింది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా జరగడం లేదు. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్‌ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు కలిపి మొత్తం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1615 జీపీలు ఉన్నాయి. డ్రైనేజీలు, డంపింగ్‌ యార్డులు కంపు కొడుతుండగా మొక్కలు ఎండుతున్నాయి.

Similar News

News December 10, 2024

ఐదున్నర దశాబ్దాలకు ఆత్మీయ సమ్మేళనం

image

పటాన్‌చెరులో 1971-72లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 55ఏళ్లకు ఆత్మీయ అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్ ఆధ్వర్యంలో పూర్వ స్నేహితులు (విద్యార్థులు) కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నట్లు వివరించారు.

News December 10, 2024

డిసెంబర్ 19న ఫుల్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఫుల్‌బాల్ అసోసియేషన్ పర్యవేక్షణలో క్రీడాకారుల ఎంపికలు డిసెంబ 19న నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి డి వై ఎస్ ఓ జయదేవ్ ఆర్యా, సిద్దిపేట ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ తెలిపారు. ఎంపికలకు క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు.

News December 9, 2024

సిద్దిపేట: పెళ్లి కావడం లేని యువకుడి సూసైడ్ !

image

పెళ్లి కావట్లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నంగునూరు మండలం సిద్ధన్నపేటకు సంగు భాస్కర్(36) కారు డ్రైవర్. ఆదివారం రాత్రి డ్రైవింగ్‌కు వెళ్లి వచ్చిన భాస్కర్.. ఉదయం చూడగా ఇంట్లో ఊరేసుకున్నాడు. పెండ్లి కావట్లేదని మనస్తాపంలో సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆసిఫ్ తెలిపారు.