News November 7, 2024
MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
Similar News
News September 19, 2025
మెదక్: 22 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

మెదక్ పట్టణంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.రాధాకిషన్ తెలిపారు. బాలికల పాఠశాలలో పదో తరగతి, బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పదో తరగతికి 194 మంది, ఇంటర్కు 524 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.
News September 19, 2025
పాపన్నపేట: ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన: కలెక్టర్

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పాపన్నపేట పీహెచ్సీలో నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పరిశీలించి, వైద్య సౌకర్యాలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబమే దేశ సంక్షేమని అన్నారు.
News September 18, 2025
MDK: మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

మెదక్లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 18, 19న దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. కళాశాలలో బీఎస్సీ, బీఏ గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్టీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 7901097706ను సంప్రదించాలని సూచించారు.