News August 22, 2024

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. సెప్టెంబర్‌ 21న ఓటర్ల తుది జాబితా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్‌ 21న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితాపై బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ 6న ఓటర్ల జాబితా ముసాయిదాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు.

Similar News

News November 16, 2025

MDK: వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు మాయం

image

తూప్రాన్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే రూ.27,100 మాయమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. ఓ వ్యక్తికి 12న వాట్సాప్‌కు వచ్చిన యోనో యాప్ లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేశాడు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.27,108 నుంచి, 27,100 డెబిట్ చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వ్యక్తి 1930 కాల్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు.

News November 16, 2025

మెదక్: దరఖాస్తుల ఆహ్వానం

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో అందించే పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నిర్వాహకుల నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17 వరకు https://wdsc.telangana.gov.in సమర్పించాలని సూచించారు.

News November 16, 2025

మెదక్ జిల్లాలో 503 కేసుల్లో రాజీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన రాజీ పడదగిన 503 కేసుల్లో రాజీ జరిగినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు నిర్వహించిన జాతీయ మేఘ లోక ఆదాలత్ కార్యక్రమంలో ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణం కల్పించి కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల్లో 41 కేసుల్లో రూ.11,44, 608 తిరిగి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.