News August 3, 2024
MDK: చేప.. చెరువుకు చేరేనా?
చేప పిల్లల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలస్యమయ్యేల కనిపిస్తుంది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మత్యశాఖ ఆఫీస్‌లో బిడ్లకు సంబంధించి టెండరు బాక్సు తెరవగా ఒక్కరూ టెండర్‌లో పాల్గొనకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో మొత్తం 1,160 చెరువులు, కుంటలు ఉన్నాయి. 227 మత్స సహాకార సంఘాలు ఉండగా వీటిలో 11,013 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడు 3.41 కోట్ల చేప పిల్లలు వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Similar News
News September 9, 2024
విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు
విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి శంకర్ తెలిపారు. సదాశివపేట మండలం నందికండి ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలపై చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో నోడల్ అధికారి సుధాకర్, ఆర్పీలు పాల్గొన్నారు.
News September 9, 2024
MDK: విద్యుదాఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి
గణేశ్ మండపం వద్ద విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో పంచాయతీ స్వీపర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రాజుపేట గ్రామానికి చెందిన దాసరి పోచయ్య (70) ఈరోజు ఉదయం మండపం వద్ద శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News September 9, 2024
MDK: క్విజ్‌లో గెలిస్తే రూ.10లక్షలు
RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం 71 కళాశాలలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.