News March 26, 2025

MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

image

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..

Similar News

News November 26, 2025

పల్నాడు: భారంగా మారిన పశుగ్రాసం..!

image

పల్నాడులో ఎక్కువగా వరి కోతకు యంత్రాలు వాడటం వలన వరిగడ్డి చిన్న ముక్కలై పొలంలోనే ఉండిపోవడంతో పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రాసం దొరకని పరిస్థితి నెలకొనడంతో, పశువులకు గడ్డి అందించడం భారంగా మారింది. దీంతో మిర్యాలగూడ వంటి దూర ప్రాంతాల నుంచి అధిక ధరలకు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ వరిగడ్డికి సుమారు రూ.15 వేలు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.

News November 26, 2025

ఏలూరు: రాజ్యాంగ పీఠికపై ప్రమాణం

image

ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు రాజ్యాంగ పీఠికను అనుసరిస్తామని ప్రమాణం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి మాట్లాడుతూ.. జాతీయ న్యాయదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటామన్నారు. భారత రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.