News March 26, 2025

MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

image

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..

Similar News

News April 22, 2025

NLG: ఇంటర్న్‌షిప్ పథకం దరఖాస్తులకు ఇవాళే లాస్ట్

image

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2వ దశ దరఖాస్తు గడువు ఇవాల్టి వరకు పొడిగించినట్లు నల్గొండ జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ వి.కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5,000 మంజూరు చేస్తారని తెలిపారు. 12 నెలల ఇంటర్న్‌షిప్‌ కాల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశానికి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 22, 2025

అల్లూరి:  సీలేరు నదిలో యువకుల మృతదేహాలు లభ్యం

image

చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో ఆదివారం గల్లంతయిన యువకుల మృతదేహాలు మంగళవారం లభ్యమైనట్లు చింతూరు ఎస్సై రమేష్ తెలిపారు. మృతులు చింతూరుకి చెందిన ఎస్.శ్రీను, ఎన్.దిలీప్ కుమార్‌గా గుర్తించినట్లు ఆయన చెప్పారు. స్నానం చేయడానికి దిగి ఒకరు గల్లంతు కాగా మరొకరు అతనిని రక్షించబోయి నది ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామన్నారు.

News April 22, 2025

విషాదం.. వడదెబ్బతో 9 మంది మృతి

image

TG: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరి కొన్ని చోట్ల ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వడదెబ్బతో 9 మంది మరణించారు. ఖమ్మం, KNR, నాగర్ కర్నూల్‌లో ముగ్గురు, ఉమ్మడి ADLBలో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

error: Content is protected !!