News March 26, 2025
MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..
Similar News
News October 15, 2025
HYDలో నాసిరకం నర్సింగ్!

నాసిరకం సౌకర్యాలు.. అంతంత మాత్రమే బోధన.. ఇదీ నర్సింగ్ స్కూళ్ల నిర్వాహకుల నిర్వాకం. దీంతో పలువురు నర్సింగ్ స్కూళ్ల వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో నర్సింగ్ కౌన్సిల్ తనిఖీలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కళాశాలలపైనే ఎక్కువగా ఫిర్యాదులందాయి. కమిటీ స్కూళ్లల్లో తనిఖీలు నిర్వహించి సర్కారుకు నివేదిక ఇవ్వనుంది.
News October 15, 2025
గోదావరిఖని: ఈనెల 19న సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం

గోదావరిఖనిలోని సింగరేణి రామగుండం ఏరియా ఆసుపత్రిలో ఈనెల 19న సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆర్జీ 1 యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్జీ 1, 2, 3, ఏఎల్పీ ఏరియా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సీపీఆర్ఎంఎస్ కార్డు హోల్డర్స్, వారి జీవిత భాగస్వామ్యులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఈరోజు నుంచే ఏరియా ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని పేర్కొంది.
News October 15, 2025
ప్రకాశం జిల్లాలో 38,866 ఎకరాల భూమి.. ఆలయాల పరిధిలోనే!

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ఏసీ పానకాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో దేవదాయ శాఖ పరిధికి సంబంధించి 1001 దేవాలయాలు ఉన్నాయని, వీటి పరిధిలో 38,866.95 ఎకరాల భూమి ఉందన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.