News February 10, 2025
MDK: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739172443469_1243-normal-WIFI.webp)
మెదక్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా నర్సాపూర్ మండలంలో 35.5, వెల్దుర్తి 34.1, నిజాంపేట 33.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News February 11, 2025
మెదక్: ‘ఇంటర్లో 100% ఫలితాలు సాధించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252958385_19780934-normal-WIFI.webp)
ఇంటర్లో 100% ఫలితాలు సాధించాలని మెదక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. రామాయంపేట జూనియర్ కళాశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ప్రాక్టికల్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం లెక్చరర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి లెక్చరర్ సబ్జెక్టుపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 11, 2025
ఓయూ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739273101812_718-normal-WIFI.webp)
ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండో దఫా మార్చి 31వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
News February 11, 2025
మెదక్: ప్రముఖ వ్యాపారి గుండెపోటుతో మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739258579734_50139766-normal-WIFI.webp)
మెదక్ పట్టణంలో ప్రముఖ వ్యాపారి మల్లికార్జున రమేష్ (58) మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. రమేశ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆయన మరణం పట్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్లు చంద్రపాల్, బట్టి జగపతి, మల్లికార్జున గౌడ్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ కృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రమేశ్ మృతి తీరిన లోటు అని అన్నారు.