News September 10, 2024

MDK: టాస్కులు, కమీషన్ పేరుతో భారీ మోసం

image

సైబర్ మోసంలో టెకీ రూ.లక్షలు పోగొట్టుకున్న ఘనట అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. జన్మభూమి కాలనీ ఫేస్-2కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టాస్కులు, కమీషన్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఉద్యోగి తన వివరాలు నమోదు చేయగా టాస్కులు పూర్తి చేస్తే పెట్టిన నగదుతోపాటు కమీషన్ వస్తుందని నమ్మించారు. ఉద్యోగి పలు దఫాలుగా రూ.15.82లక్షలు వేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించ లేదు.

Similar News

News November 17, 2024

మెదక్: డబ్బుల విషయంలో గొడవ.. వ్యక్తి హత్య

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో డబ్బుల విషయంలో మేస్త్రీల మధ్య గొడవ జరిగి ఒకరు హత్యకు గురయ్యారు. పోలీసుల వివరాలు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రమోద్ (40), బిట్టు మేస్త్రిలుగా పనిచేస్తున్నారు. ప్రమోద్ వద్ద పని చేస్తున్న బిట్టు రాత్రి మద్యం తాగిన సమయంలో డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. బిట్టు కట్టెతో దాడి చేయగా ప్రమోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News November 17, 2024

UPDATE: జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

జహీరాబాద్‌లోని బైపాస్ వద్ద <<14625689>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదర్శనగర్ మలుపు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో NZB జిల్లా డిచ్పల్లికి చెందిన సురేశ్, కుత్బుల్లాపూర్‌కు చెందిన నరసింహారావు స్పాట్‌లో మృతి చెందారు. తీవ్రగాయాలైన శివకుమార్ సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్ణాటకలోని గానుగపూర్‌‌కి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

News November 17, 2024

MDK: గ్రూప్‌-3 పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

image

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గ్రూప్‌-3 పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. MDK జిల్లాలో 5,867 మంది అభ్యర్థులు, 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లాలో 13,401 మంది అభ్యర్థులు, 37 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షకు హాజరుకానున్నారు. సంగారెడ్డి జిల్లాలో 15,123 మంది అభ్యర్థులు 49 పరీక్ష కేంద్రాల్లో హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు.