News August 24, 2024

MDK: డెంగ్యూతో బాలుడి మృతి

image

చిన్నకోడూరు మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలుడు కామ అయాన్స్ (5) డెంగ్యూతో మృతి చెందాడు. స్థానికుల వివరాలు… బాలుడికి గత 3 రోజుల క్రితం తీవ్ర జ్వరం రాగా తల్లిదండ్రులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు. ఈ విషయమై డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. రెండు రకాల డెంగ్యూ వైరస్‌లు అటాచ్ కావడంతో మెదడుపై ఎఫెక్ట్ పడి బాలుడు మృతి చెందాడని వివరించారు.

Similar News

News September 14, 2024

MDK: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య

image

భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. – VKB జిల్లాకు చెందిన భార్యాభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డికి వచ్చి స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది

News September 14, 2024

MDK: సీఎం బ్రేక్‌ఫాస్ట్ ఉన్నట్టా.. లేనట్టా?

image

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం స్కూల్‌లో అల్పాహారం అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. గత అక్టోబర్‌లో ప్రారంభమైన పథకం ఏప్రిల్ వరకు కొనసాగింది. మెదక్ జిల్లాలో 904 పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉండగా, గతేడాది కేవలం 35 పాఠశాలల్లోనే పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు కావస్తున్నా అల్పాహారం మాత్రం అందించడం లేదు.

News September 14, 2024

సిద్దిపేట: చిన్నారి గుండెలకు భరోసా

image

సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు ‘సత్యసాయి హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌’ సంజీవిని దవాఖానతో చిన్నారుల గుండెకు భరోసా అందించేందుకు ముందుకు వచ్చింది. 5ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో దవాఖాన నిర్మించారు. నేడు ఈ దవాఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు.