News February 25, 2025

MDK: దేశానికి అన్నం పెట్టే రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు: హరీశ్ రావు

image

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్‌ సర్కార్‌ పునరావృతం చేస్తున్నదని మండిపడ్డారు.

Similar News

News October 26, 2025

ADB: ఉపాధ్యాయులా.. కీచకులా..?

image

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు కీచకులుగా మారుతున్నారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడుతూ గొప్పవృత్తికి చెడ్డపేరు తెస్తున్నారు. బాసరలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. గతంలో MNCL జిల్లాలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాంటి వారిని సస్పెండ్ చేసి పోక్సో కేసులు నమోదు చేశారు. వారి నుం చిపిల్లలను కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

News October 26, 2025

ఆదిలాబాద్: ‘31లోగా బోర్డుకు ఫీజు చెల్లించాలి’

image

ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు (రూ. 220), గ్రీన్ ఫండ్ ఫీజు (రూ.15) కలిపి మొత్తం రూ.235ను ఈనెల 31 లోగా చెల్లించాలని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపల్‌లు tgbie.cgg.gov.in పోర్టల్‌ ద్వారా చెల్లింపులు చేయాలని ఆయన ఆదేశించారు. సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 26, 2025

మద్యం షాపులకు రేపు లక్కీ డ్రా

image

TG: మద్యం దుకాణాలకు రేపు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రాలు తీయనున్నారు. జిల్లాల వారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. మొత్తం 2,620 షాపులకు 95 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌కు భారీగా డిమాండ్ నెలకొంది. శంషాబాద్ పరిధిలో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు రావడం గమనార్హం.