News September 4, 2024
MDK: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ
వినాయక నవరాత్రి వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. జోగిపేటలో శాంతి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబి, వినాయక నిమజ్జనం ఒకేసారి రావడంతో ఇరువర్గాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్సై పాండు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 7, 2024
నర్సాపూర్: చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన అశోక్ మృతదేహం బయటపడింది. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన అశోక్ చెరువులో గల్లంతయ్యారు. నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కే ప్రశాంత్, నాగరాజు, మధు, రమేశ్, వెంకటేశ్‌లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలించారు.
News September 7, 2024
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, ఈద్ – మిలాద్- ఉన్ -నబీ, ఇతర పండగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సభ్యులకు సూచనలు చేస్తూ ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి మెదక్ జిల్లాలో ఉన్నదన్నారు.
News September 6, 2024
ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో సబ్ జూనియర్ జట్ల ఎంపిక
తూప్రాన్ పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్ హైస్కూల్‌లో 9న ఉమ్మడి మెదక్ జిల్లా సబ్ జూనియర్ ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ మహేందర్ రావు, పోచప్ప, నాగరాజు తెలిపారు. 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా కల్లూరు మినీ స్టేడియంలో 34 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే బాల బాలికల మెదక్ జిల్లా జట్ల ఎంపికలు చేపడుతున్నట్లు వివరించారు. వివరాలకు 98665 46563 సంప్రదించాలని సూచించారు.