News November 30, 2024

MDK: నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాం: మంత్రి

image

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేసి తీరుతామని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. కులగణనతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు.

Similar News

News December 11, 2024

క్రీడా సమాఖ్య పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ

image

వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో జరుగుతున్న క్రీడా సమాఖ్య పాఠశాల స్థాయి అండర్-14 వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ చూపుతున్నట్లు కోచ్ అల్లి నరేశ్ తెలిపారు. బాలుర విభాగంలో మొదటి మ్యాచ్ పంజాబ్(3-2)తో, రెండవ మ్యాచ్ ఢిల్లీ(3-0)తో విజయం సాధించినట్లు వివరించారు. విజయం పట్ల అధ్యక్షుడు నాగరాజు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రమేష్, కిషోర్, దేవానంద్, హరిత, పుష్పవేణి హర్షం వ్యక్తం చేశారు.

News December 11, 2024

 మెదక్: వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్ !

image

వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. టేక్మాల్ మం. కొరంపల్లికి చెందిన ప్రభాకర్‌కు పాపన్నపేట మం. గాందారిపల్లి చెందిన లావణ్య(38)తో 20ఏళ్ల క్రితం పెళ్లైంది. కాగా లావణ్య నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. అయితే తన చెల్లి చివరిగా ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఆమె అన్న కాశీనాథం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు  కేసు నమోదు చేశారు.

News December 11, 2024

డిసెంబర్ 15వ తేదీన జిల్లాకు విశారదన్ మహారాజ్ రాక

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిసెంబర్ 15న జరిగే ధర్మ సమాజ్ పార్టీ (DSP) జిల్లా మహాసభ (ప్లీనరీ)కి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధినేత విశారదన్ మహారాజ్ హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు సదన్ మహరాజ్ తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 93 శాతం మంది బీసీ, ఎస్సీ ఎస్టీ, అగ్ర కుల పేదల తరఫున పోరాడే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ అన్నారు.