News March 24, 2025
MDK: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
తూప్రాన్: తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు మెంబర్

తూప్రాన్ మండలంలో తమ్ముడు సర్పంచ్‌గా ఎన్నిక కాగా.. అక్క మనోహరాబాద్ మండలంలో వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎంజాల స్వామి సర్పంచిగా ఎన్నికయ్యారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామపంచాయతీలో స్వామి అక్క కనిగిరి అనసూయ వార్డు సభ్యురాలుగా పోటీ చేసి గెలుపొందారు. తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు సభ్యురాలుగా కొనసాగుతున్నారు.
News December 19, 2025
MDK: సతులు సర్పంచ్‌లు.. పతులు వార్డ్ మెంబర్లు

నర్సాపూర్ మం. ఆవంచ, కాగజ్ మద్దూర్‌లో సర్పంచులుగా సతీమణులను గెలిపించుకొని, భర్తలు వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఆవంచలో స్రవంతి సర్పంచ్‌గా గెలుపొంది, భర్త కర్ణాకర్ (Ex.సర్పంచ్) వార్డ్ సభ్యుడిగా గెలుపొందారు. కాగజ్ మద్దూర్‌లో విజయ సర్పంచ్‌గా గెలుపొంది, భర్త శివకుమార్ (Ex.సర్పంచ్) వార్డు సభ్యుడిగా గెలుపొందారు. వారు మాజీ సర్పంచ్‌లుగా కొనసాగి గ్రామానికి సేవలు అందించిన మళ్లీ గ్రామస్థులు పట్టం కట్టారు.
News December 18, 2025
మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.


