News April 9, 2025
MDK: నేటి నుంచి పరీక్షలు

నేటి నుంచి 17 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ నెల 9 నుంచి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈనెల 11 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. పరీక్షలు ఉదయం గం.9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
యాక్సిడెంట్.. మెదక్ యువకుడు మృతి

HYD శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మెదక్ పట్టణానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణానికి చెందిన కాముని శ్రీనివాస్ కుమారుడు కాముని భారత్ (23) ఈరోజు ఉదయం రింగ్ రోడ్డుపై కారులో వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న మెదక్ కరూర్ వైశ్య బ్యాంకు మేనేజర్ భార్యకు తీవ్ర గాయాలవగా అసుపత్రికి తరలించారు. పట్టణంలో విషాదం అలుముకుంది.
News November 21, 2025
తూప్రాన్: విద్యార్థులు ఇష్టంతో చదవాలి: డీఈవో

పదవ తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ పేర్కొన్నారు. శుక్రవారం తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఎస్ఎస్సీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేకతలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరాలు ఉంటే సహకరిస్తానని, పరీక్షకు అందరూ హాజరై ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.