News March 15, 2025
MDK: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఈ హాఫ్డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.
Similar News
News March 17, 2025
రామాయంపేట: అప్పుల బాధతో ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఒక యువకుడు పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆరు వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుర్ర రమేష్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత సోమవారం ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు సేవించారు. బంధువులు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
News March 17, 2025
తూప్రాన్: తల్లిదండ్రులు మృతి చెందారని.. కొడుకు ఆత్మహత్య

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన చింతల రాజు (24) తండ్రి బాల నరసయ్య ఏడాది క్రితం మరణించగా, పది రోజుల క్రితం తల్లి పోచమ్మ మృతి చెందింది. మృతి చెందినప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. 12న తల్లి దశదినకర్మ జరిపి, రాత్రి పురుగుల మందు సేవించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు
News March 17, 2025
మెదక్: అగ్ని వీర్ కోసం యువత దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

యువత ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లో ఆదివారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని యువకులు ఇండియన్ ఆర్మీలో చేరి సేవలందించేందుకు ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఉందని అన్నారు. అగ్ని వీర్ కోసం ఈ నెల 12 నుంచి https://www.joinindianarmy.nic.in వెబ్ పోర్టల్లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.