News October 19, 2024

MDK: నేడు జిల్లాకు హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి రాక

image

రాష్ట్ర హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తెలిపారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి ఉదయం 8:15 గంటలకు ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుని, అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు అల్లాదుర్గంలోని కోర్టు కాంప్లెక్సు ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత మెదక్ చేరుకొని బార్ అసోసియేషన్ తో సమావేశం నిర్వహించి, మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.

Similar News

News October 19, 2025

మెదక్: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సుశాంత్ గౌడ్ ఎంపిక

image

గ్రూప్-2 పరీక్షల్లో మెదక్ పట్టణానికి చెందిన మంగ నారా గౌడ్, ఇందిర దంపతుల తనయుడు సుశాంత్ గౌడ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్-2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సుశాంత్ గౌడ్ ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉత్తర్వులు అందుకున్నారు.

News October 18, 2025

దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

ప్రజలంతా దీపావళి పండుగను సురక్షితంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణహిత టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 101కు కాల్ చేయాలని సూచించారు.

News October 18, 2025

పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రాహుల్

image

పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాహుల్ సూచించారు. టేక్మాల్ మండలంలోని బర్దిపూర్‌లో పత్తి పంటను ఆయన పరిశీలించారు. జిల్లాలో 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి పండించారని, పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పింజరకం(8110) రకానికి రూ. 8,110, పింజరకం(8060)కు రూ. 8,060 మద్దతు ధరలు ఉంది.