News October 19, 2024
MDK: నేడు జిల్లాకు హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి రాక
రాష్ట్ర హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తెలిపారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి ఉదయం 8:15 గంటలకు ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుని, అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు అల్లాదుర్గంలోని కోర్టు కాంప్లెక్సు ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత మెదక్ చేరుకొని బార్ అసోసియేషన్ తో సమావేశం నిర్వహించి, మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.
Similar News
News November 2, 2024
UPDATE: రోడ్డు ప్రమాదం మృతులు వీరే..
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు (45), లావణ్య (30), సహస్ర (9), శాన్వి (7)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. లావణ్య తన ఇద్దరు కూతుర్లయిన సహస్ర, శాన్వితో బంధువుల ఇంటికి వెళ్తుంది. లావణ్య భర్త కుమార్ సోదరుడు ఆంజనేయులు బస్ స్టాప్ వద్ద దించేందుకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
News November 2, 2024
మెదక్: ఘోర ప్రమాదం.. మృతులు వీరే!
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
News November 2, 2024
MDK: పెళ్లిళ్ల సీజన్ షురూ.. డిసెంబర్ వరకు ముహూర్తాలే!
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు. నవంబర్‌లో 3,7,8,9,10,13,14,15,16,17, డిసెంబర్‌లో 5,6,7,8,9,11,13, 14,15,18, 26 తేదీల్లో పెళ్లికి ఈ రెండు నెలల్లో 21 రోజులు మంచి ఘడియలు ఉన్నట్టు పురోహితులు తెలిపారు. ఇప్పటికే పెళ్లిళ్ల కోసం ఫంక్షన్‌హాళ్లు బుకింగ్‌లు మొదలయ్యాయి.