News December 2, 2024

MDK: నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో నూతనంగా నిర్మించిన హిందూస్తాన్ లీవర్ కోకాకోలా బేవరేజెస్ ఫాక్టరీని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి శనివారం కోకాకోలా ఫ్యాక్టరీని సందర్శించి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఫ్యాక్టరీ అధికారులతో చర్చించారు.

Similar News

News March 12, 2025

మెదక్ జిల్లాలో పోలీస్ హోంగార్డు మృతి

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన పోలీస్ హోంగార్డ్ తలారి మహేందర్(39) మంగళవారం రాత్రి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

News March 12, 2025

మెదక్: మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా ఏఎన్ఎంలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏఎన్ఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. గర్భం దాల్చిన మహిళలు పీహెచ్‌సీ, ప్రభుత్వ ఆసుపత్రులలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

News March 12, 2025

మెదక్: గ్రూప్-2లో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 3వ ర్యాంక్

image

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రావుకు రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు 439.344 మార్కులు సాధించాడు. గ్రూప్-1లో కూడా 430 మార్కులు సాధించాడు. 2020లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి 317 జీఓలో మెదక్ జిల్లాకు వచ్చాడు. స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఉజలంపాడు.

error: Content is protected !!