News April 9, 2024
MDK: పండగ పూట విషాదం
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి శివారులో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన ఎరుకల మహేశ్(21) ఉగాది పండగ నేపథ్యంలో మామిడి ఆకుల కోసం పల్సర్ బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న మరో బైక్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో మహేశ్ కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వచ్చి పరిశీలించారు.
Similar News
News November 2, 2024
సిద్దిపేట: డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియ గడువు పొడిగింపు
డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ (CBCS) నూతనంగా అడ్మిషన్ గడువు పొడిగించినట్లు సిద్దిపేట అంబేడ్కర్ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఏం శ్రద్ధానందం తెలిపారు. ఈ నెల 15వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్ పొందవచ్చు అన్నారు. https://www.braouonline.in వెబ్సైట్లో అడ్మిషన్ పొందవచ్చు అన్నారు.
News November 2, 2024
BREAKING: జహీరాబాద్‌లో విషాదం.. బాలుడి మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో సాత్విక్(12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడి శరీరంలో పటు చోట్ల గాయాలున్నాయి. కాగా, హాస్టల్ బెడ్‌పై నుంచి పడి చనిపోయి ఉంటాడని పాఠశాల యాజమాన్యం చెబుతున్నారు. మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు.
News November 2, 2024
సంగారెడ్డి: వీఆర్‌లో ఉన్న ఎస్సై వినయ్ కుమార్ సస్పెండ్
సంగారెడ్డి వీఆర్ ఉన్న ఎస్సై వినయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి రూరల్ ఎస్సైగా వినయ్ కుమార్ పనిచేస్తున్న సమయంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో సక్రమంగా విధులు నిర్వహించ లేదని వీఆర్‌కు బదిలీ చేశారు. కాగా, ఈరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.