News March 6, 2025

MDK: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

Similar News

News December 1, 2025

నస్పూర్: ‘ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.

News December 1, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News December 1, 2025

కోలుకున్న గిల్, హార్దిక్.. సౌతాఫ్రికాతో టీ20లు ఆడే ఛాన్స్!

image

గాయాల కారణంగా కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. హార్దిక్ T20లలో ఆడేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ క్లియరెన్స్ ఇచ్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గిల్‌కు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో వీరు ఆడే ఛాన్స్ ఉంది. వీరి రాకతో టీమ్ ఇండియా బలం పెరగనుంది.