News October 2, 2024
MDK: పల్లెల్లో బతుకమ్మ పండుగ సందడి

ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఈరోజు పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు హాస్టల్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీగా ఏర్పడింది. గ్రామాల్లో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తంగేడు, గునుగు, వివిధ రకాల పూల సేకరణలో నిమగ్నమయ్యారు.
Similar News
News December 9, 2025
మెదక్: ఎన్నికల రోజు స్థానిక సెలవు

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు.. 39 తీర్మానాలు ఆమోదం

మెదక్ పట్టణంలో జరిగిన సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు మంగళవారం ముగిశాయి. రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రావు ప్రవేశపెట్టిన 39 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా శ్రమశక్తి నీతి-2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
News December 9, 2025
మెదక్: సర్పంచ్ బరిలో జర్నలిస్టులు

పంచాయతీ ఎన్నికల్లో జర్నలిస్టులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాము గెలుపొంది ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు. మెదక్ జిల్లాలో మక్తభూపతిపూర్ (సిహెచ్. అశోక్), బూర్గుపల్లి (సాయిలు), కల్వకుంట (రంగా రాజకిషన్), చంద్లాపూర్ (కృష్ణాగౌడ్), చందంపేట (నాయిని ప్రవీణ్), పొడ్చన్పల్లి(భూమయ్య)ల్లో జర్నలిస్టులు సర్పంచ్ బరిలో నిలిచారు.


