News February 14, 2025
MDK: పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి: కలెక్టర్

పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయా సంబంధించిన వివిధ దశలలో ఉన్న పనులను వాటి పురోగతిని సమీక్షించి సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు.
Similar News
News November 15, 2025
RMPT: Way2News ఎఫెక్ట్.. కేసు నమోదు

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో అకారణంగా మద్యం మత్తులో బాలుడిపై దాడి చేసిన పినతండ్రి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. <<18287012>>Way2Newsలో వచ్చిన కథనానికి<<>> స్పందించిన ఎస్ఐ బాలరాజు వివరాలు సేకరించారు. మద్యం మత్తులో పినతండ్రి నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసినట్టు గుర్తించామని, సత్యనారాయణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 15, 2025
RMPT: Way2News ఎఫెక్ట్.. స్పందించిన DWO

Way2News కథనానికి జిల్లా మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి స్పందించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో ‘<<18287012>>మద్యం మత్తులో కుమారుడిపై దాడి<<>>’ అని Way2Newsలో కథనం రావడంతో స్పందించిన DWO పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాలుడిపై దాడి చేసిన పినతండ్రిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. బాలుడికి సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు.
News November 15, 2025
మెదక్: నేడు జిల్లాలో కవిత పర్యటన ఇదే

మెదక్ జిల్లాలో రెండవ రోజు శనివారం కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట షెడ్యూల్ ఈవిధంగా ఉంది. హవేలి ఘన్పూర్ మండలం కూచన పల్లిలో పాడి రైతులతో సమావేశం
2.రమేష్ కుటుంబ సభ్యుల పరామర్శ,
3.మెదక్లో ప్రెస్ మీట్,
4.మేధావులతో సమావేశం, బూరుగుపల్లి, రాజుపేట, వాడి, దూప్ సింగ్ తండాలో వరద బాధితుల పరామర్శ, 5.పొలంపల్లిలో కేవల్ కిషన్, చిన్నశంకరంపేట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.


