News February 14, 2025

MDK: పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయా సంబంధించిన వివిధ దశలలో ఉన్న పనులను వాటి పురోగతిని సమీక్షించి సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు.

Similar News

News March 28, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన తల్లి..

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు ఓ తల్లి విషం ఇచ్చి తానూ సేవించింది. కాగా, విషం తాగిన తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతులు.. గౌతమ్(8), సాయికృష్ణ(12), మధుప్రియ(10). మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

మెదక్: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య !

image

మెదక్ పట్టణం గాంధీ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహమ్మద్ ఫారుక్(32) తన రేకుల ఇంటిలోనే ఉరివేసుకున్నట్లు కుటుంబీకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తోన్నారు.

News March 28, 2025

మెదక్: ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి వీడ్కోలు

image

ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన మెదక్ జిల్లాకు చెందిన శేరి సుభాష్ రెడ్డి గురువారం పదవి వీడ్కోలు పొందారు. హవేలిఘనపూర్ మండలం కూచన్‌పల్లికి చెందిన శేరి సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి గులాబీ పార్టీలో పనిచేశారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన సుభాష్ రెడ్డికి ఆరు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నేటితో పదవి ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ సత్కరించారు.

error: Content is protected !!