News June 23, 2024
MDK: ఫసల్ ప్రీమియం బాధ్యత ప్రభుత్వానిదే !

‘ఫసల్’ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశం సంగారెడ్డిలో మే 23న జరిగింది. ప్రీమియం భారం మొత్తం ప్రభుత్వమే భరించనుంది. గ్రామ యూనిట్‌గా వరి, మొక్కజొన్న, మండలం యూనిట్‌గా పత్తిని గుర్తించారు. రైతుల అభిప్రాయం తీసుకున్న కలెక్టర్లు తర్వలో మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో సుమారుగా 14 లక్షల ఎకరాల్లో పంట సాగు కానుంది.
Similar News
News December 9, 2025
MDK: ఎన్నికల అధికారి కారు, ఆటో ఢీ.. మహిళ మృతి

నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ఇన్నోవా కారు ఆటోను ఢీ కొట్టడంతో జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న ఓ మహిళకు తాకింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆటోను ఢీ కొట్టిన ఇన్నోవా కారు నిర్మల్ ఎన్నికల అబ్జర్వర్‌దిగా తెలుస్తుంది.
News December 9, 2025
మెదక్: కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కలెక్టర్ దూరం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు. ముందుగా కలెక్టర్ల చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నందున మెదక్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నారు. దీంతో డీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ముగించారు.
News December 9, 2025
మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.


