News August 4, 2024
MDK: బకెట్లో పడి 8 నెలల చిన్నారి మృతి

బకెట్లో పడి 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పరిగిలో జరిగింది. స్థానికులు వివరాలు.. బిహార్కు చెందిన ధర్మేందర్ ఓ ఐరన్ కంపెనీలో పని చేస్తూ బీసీ కాలనీలో భార్య, 8 నెలల కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారిని గదిలో కూర్చోబెట్టి భార్య వాష్ రూంకి వెళ్లింది. అయితే ఆడుకుంటూ వెళ్లి చిన్నారి ప్రమాదవశాత్తు బాల్కనీలో ఉన్న బకెట్లో పడి మృతి చెందింది. దీంతో కుటుబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 9, 2025
మెదక్: కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కలెక్టర్ దూరం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు. ముందుగా కలెక్టర్ల చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నందున మెదక్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నారు. దీంతో డీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ముగించారు.
News December 9, 2025
మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
News December 9, 2025
MDK: ఉత్సాహంతో యువత గ్రామ పోరులోకి

మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోరుకు యువత రంగంలోకి దిగింది. ప్రస్తుత తరుణంలో రాజకీయాలపై ఇష్టన్నీ, బాధ్యతను గుర్తించిన యువత ఈసారి జరగనున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించునున్నారు. గ్రామ అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. ప్రశ్నించే గొప్ప తత్వాన్ని అలవర్చుకొని, ప్రజాసేవలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డబ్బు, మద్యం లేని ఈ రాజకీయాల్లో రాణిస్తారో, లేదో!


