News October 17, 2024
MDK: బతుకమ్మ పండుగకు పుట్టింటికి పంపలేదని..

బతుకమ్మ పండుగకు పుట్టింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చేర్యాల(M) ఆకునూరులో చోటుచేసుకుంది. హన్మకొండ(D) క్యాతంపల్లికి చెందిన సౌమ్య(22 నాలుగేళ్ల క్రితం ఆకునూరుకు చెందిన శ్రావణ్కు ఇచ్చి వివాహం చేయగా, ఏడాదిన్నర కూతురు ఉంది. బతుకమ్మకు పుట్టింటికి సౌమ్యను పంపకపోవడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ సిద్దిపేటలో ఓ ఆసుపత్రిలో బుధవారం మృతిచెందిందని SI నీరేష్ తెలిపారు.
Similar News
News November 19, 2025
మెదక్: తండ్రి దాడిలో గాయపడ్డ వంశీని పరామర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ కేంద్రంలో చికిత్స పొందుతున్న వంశీని కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో మద్యం మత్తులో తండ్రి కొడుకు వంశీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీ వద్దకు వెళ్లి కలెక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.
News November 18, 2025
మెదక్: కక్షపూరిత కేసులపై బీఆర్ఎస్ సీరియస్.. డీజీపీకి ఫిర్యాదు

మెదక్ బీఆర్ఎస్ టౌన్ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులుపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసును రద్దు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హాని అన్నారు. ఆంజనేయులుపై కేసును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
News November 18, 2025
MDK: వైద్య కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు, వసతుల మెరుగుదలకు సూచనలు ఇచ్చి అధికారులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


