News April 30, 2024
MDK బరిలో 44.. ZHB నుంచి 19 మంది అభ్యర్థులు
మెదక్ లోక్ సభ బరిలో 44 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్లు వేయగా స్ర్కూటీనిలో ఒకటి రిజెక్ట్ అయింది. సోమవారం వరకు 9 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గుర్తింపు పొందిన BRS, కాంగ్రెస్, BRS, బీఎస్పీ నుంచి నలుగురితోపాటు 11 మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, 29 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. మెదక్‌లో ముక్కోణపు పోటీ జరగనుంది. అటు <<13147815>>జహీరాబాద్ బరిలో<<>> 19 మంది నిలిచారు.
Similar News
News November 1, 2024
గంజాయి స్మగ్లర్లకు సహకారం.. ఎస్సై, హెడ్, కానిస్టేబుల్ సస్పెండ్
గంజాయి స్మగ్లర్లకు సహకరించిన పటాన్‌చెరు ఎస్సై అంబరియా, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధును సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. మనూరు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో సనాత్పూర్, నిజామాబాద్ జిల్లా వర్ని వద్ద గంజాయి పట్టుకొని నిందితులను వదిలిపెట్టారు. నిందితులు మరోసారి పట్టు పడడంతో విషయం బయటపడింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుకు పరిశీలిస్తున్నట్లు వివరించారు.
News November 1, 2024
బెజ్జంకి: డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్య
డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI కృష్ణారెడ్డి వివరాలు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సోము శంకర్(33) పీజీ వరకు చదువుకున్నాడు. ఇటీవల DSC రాయగా ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 1, 2024
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దీపావళి వేడుకలు
దీపావళి పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కుమార్తెలు రంగురంగుల పూలతో అలంకరించిన దీప కాంతులు వెలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు ఆనందం, శాంతి, విజయాలతో నిండిన సంతోషకరమైన సమయాన్ని గడపాలని ఆకాంక్షించారు.