News February 13, 2025
MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
Similar News
News May 7, 2025
జప్తి శివునూరు గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య

నార్సింగ్ మండలం జప్తి శివునూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద సుధాకర్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన సుధాకర్ జప్తి శివునూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ, సంతానం లేకపోవడంతో మనస్తాపానికి గురై సుధాకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 7, 2025
మెదక్: రేపే మోడల్ స్కూల్ పరీక్ష

మెదక్ జిల్లాలో ఈనెల 27న ఆదివారం నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఈ స్కూళ్లలో కార్పొరేట్కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని, ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -SAHRE IT
News May 7, 2025
ఏడుపాయల చెక్ డ్యాంలో మునిగి వ్యక్తి మృతి

ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్కు చెందిన దేవరపాగ వీరస్వామి(40) శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు వెళ్లిన వీరస్వామి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతి చెందారు. దీంతో విందులో విషాదం నెలకొంది.