News March 14, 2025
MDK: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

మెదక్ జిల్లా మక్కరాజ్ పేట్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి.
– HAPPY HOLI
Similar News
News December 7, 2025
ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

ఫరీదాబాద్‌లోని <
News December 7, 2025
సర్పంచ్‌గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It
News December 7, 2025
నూజివీడు: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం

నూజివీడులో ట్రిపుల్ ఐటీలో చదువుతున్న బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టడీ క్లాస్ నుంచి హాస్టల్ కు వెళ్లవలసిన బాలిక కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. బాలిక అదృశ్యంపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నూజివీడు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


