News April 19, 2024
MDK: బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఒక గ్రామంలో బాల్య వివాహాన్ని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఒక గ్రామంలో బాలికకు వివాహం చేస్తున్నారంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే గ్రామానికి చేరుకున్న ఎస్సై మహమ్మద్ గౌస్.. బాలికను పోలీస్ స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. బాలికకు వివాహం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 9, 2024
విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు
విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి శంకర్ తెలిపారు. సదాశివపేట మండలం నందికండి ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలపై చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో నోడల్ అధికారి సుధాకర్, ఆర్పీలు పాల్గొన్నారు.
News September 9, 2024
MDK: విద్యుదాఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి
గణేశ్ మండపం వద్ద విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో పంచాయతీ స్వీపర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రాజుపేట గ్రామానికి చెందిన దాసరి పోచయ్య (70) ఈరోజు ఉదయం మండపం వద్ద శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News September 9, 2024
MDK: క్విజ్‌లో గెలిస్తే రూ.10లక్షలు
RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం 71 కళాశాలలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.