News April 23, 2025
MDK: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.
Similar News
News September 2, 2025
అలా అయితే హరీశ్ వేరే పార్టీ పెట్టుకుంటారు: కోమటిరెడ్డి

TG: కవిత విషయంపై రేపు ఆలోచిద్దామని KCR అన్నట్లు తెలిసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే హరీశ్ రావు ఊరుకోరన్నారు. ఆయన వేరే పార్టీ పెట్టుకుంటారని జోస్యం చెప్పారు. అయితే తాము కేసీఆర్, కవిత కుటుంబ గొడవలో తలదూర్చమని అన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని కామెంట్ చేశారు. ఇక కవిత తమ సీఎం గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
News September 2, 2025
రాయికల్: ‘రెండేళ్లు గడుస్తున్నా పెన్షన్లు పెంచలేదు’

రాయికల్ పట్టణ కేంద్రంలో దివ్యాంగుల, వృద్ధుల, చేయూత, పెన్షన్ దార్ల మహా గర్జన సన్నాక సదస్సును సోమవారం MRPS అధ్యక్షులు మందకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 9న హైదరాబాదులో జరిగే మహాగర్జన సభకు భారీ ఎత్తున ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చారు.
News September 2, 2025
జగిత్యాల: ‘పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి’

రాష్ట్ర ఉద్యోగ సంఘాల JAC అధ్యక్షులు లచ్చిరెడ్డి పిలుపు మేరకు HYD సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు జగిత్యాల జిల్లా తెలంగాణ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు సోమవారం తరలివెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్, చిట్యాల భూమయ్య, రాజశేఖర్లు పాల్గొన్నారు.