News December 31, 2024

MDK: బై బై 2024.. ఏం సాధించారు? ఏం కోల్పోయారు?

image

ఈ ఏడాది నేటితో పూర్తవుతోంది. అయితే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను మిగిల్చింది. చేసిన తప్పుల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. వాటన్నింటిని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేసుంటారు. మరీ ఈ ఏడాది మీరేం సాధించారు? ఏం కోల్పోయారు? ఏం నేర్చుకున్నారు? మీ మధుర జ్ఞాపకాన్ని కామెంట్ చేయండి.

Similar News

News January 21, 2025

మెదక్: గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న ప్రారంభించనున్న నాలుగు పథకాలపై గ్రామ/వార్డు సభల నిర్వహణపై సమీక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం నిర్వహిస్తోన్న క్షేత్రస్థాయి సర్వే పరిశీలనలో అలసత్వం వహించకుండా వేగవంతం చేయాలన్నారు.

News January 20, 2025

మనోహరాబాద్: మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నం

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని పాత బావిలో కుళ్లిపోయిన వ్యక్తి శవం లభ్యమైంది. శవాన్ని గుర్తించేందుకు విచారణ చేస్తున్నట్లు మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ రోడ్డులో పాత బావిలో శవాన్ని గుర్తించినట్లు వివరించారు. కుళ్లిపోయిన శవాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని తూప్రాన్ మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.

News January 20, 2025

మెదక్: పెరుగుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ 8.9, జహీరాబాద్ 9.9, న్యాల్కల్ 10.2, మెదక్ జిల్లాలోని టేక్మాల్ , నార్సింగి 12.2, రామాయంపేట 12.4, సిద్దిపేట జిల్లాలోని కొండపాక 10.9, మార్కూక్ 11.2, మిర్దొడ్డి 12.0°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.