News September 27, 2024
MDK: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
Similar News
News October 7, 2024
మెదక్: ‘ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలువురు దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, దరఖాస్తు దారులు, తదితరులు పాల్గొన్నారు.
News October 7, 2024
మెదక్: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు
మెదక్ జిల్లాలోని ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు ఈనెల 31 వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యలో చదువు ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం స్థానికంగా ఉండే ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో సంప్రదించాలన్నారు.
News October 7, 2024
గజ్వేల్‌లో కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం
గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. నియోజకవర్గంలో చాలా రోజులుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఎంసీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. చెక్కుల పంపిణీ చేయాలని సహకారం ఇవ్వాలని కోరుతూ.. కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చారు. వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భాస్కర్ తదితరులు ఉన్నారు.