News September 14, 2024

MDK: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య

image

భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. – VKB జిల్లాకు చెందిన భార్యాభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డికి వచ్చి స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది

Similar News

News November 25, 2025

పాపన్నపేట: ఇంట్లో నుంచి వెళ్లి యువకుడి సూసైడ్

image

పాపన్నపేట మండలం కొత్తపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది ఉమేష్ ముదిరాజ్(23) కుటుంబ సమస్యలతో గొడవ పడి రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. సోదరికి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పడంతో అతని కోసం గాలించినా ఆచూకీ లభించదు. ఉదయం స్కూల్ వెనకాల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

News November 25, 2025

మెదక్: 49 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుండి 2,00,334 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 323.04 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. అలాగే, 5,008 మంది సన్నధాన్యం రైతులకు రూ. 11.56 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

News November 25, 2025

మెదక్‌: కార్మికులు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక భీమా పెంపు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఒక లక్ష నుంచి రూ.2లక్షల వరకు పెంచినట్లు తెలిపారు.