News August 30, 2024
MDK: మండపాలకు పర్మిషన్.. ఇవి తప్పనిసరి

ఉమ్మడి మెదక్ జిల్లాలోని వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల మరో కీలక సూచన.
➤ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీని PSలో సమర్పించాలి
➤రూ.145తో మీసేవా చలాన్ తీసుకోవాలి (అదనపు ఛార్జీ రూ.100)
➤ఎలక్ట్రిసిటీ DD తప్పనిసరి
➤ఆర్గనైజర్ల ఆధార్ కార్డు జిరాక్స్లు ఐదుగురివి జతచేయాలి
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC తీసుకోండి
వీటన్నింటినీ జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే పోలీస్ అనుమతి పొందవచ్చు.
SHARE IT
Similar News
News July 11, 2025
మెదక్: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు బడ్జెట్ విడుదలైందని DEO రాధా కిషన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. జిల్లాకు రూ.26,97,786 విడుదల చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.
News July 11, 2025
రాబోయే తరాల కోసం కృషి చేయాలి: డీఈవో

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఈవో డాక్టర్ రాధా కిషన్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
News July 11, 2025
MDK: ‘చదువుకోసం సైకిల్ తొక్కుతాం’

చదువు కోసం సైకిల్ తొక్కుతామని మెదక్ మండలంలోని ర్యాలమడుగు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు అన్నారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు తమ గ్రామానికి సుమారు 2 KM దూరంలో ఉన్న మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ప్రతిరోజూ సైకిల్ పై పాఠశాలకు వెళ్లివస్తుంటారు. ఆటోలో వెళ్లాలంటే డబ్బులు కావాలని, చదువు కోసం కష్టమైనా సైకిల్ పైనే వెళ్తామన్నారు.