News May 11, 2024
MDK: ముగిసిన ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు

ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
Similar News
News December 9, 2025
మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
News December 9, 2025
MDK: ఉత్సాహంతో యువత గ్రామ పోరులోకి

మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోరుకు యువత రంగంలోకి దిగింది. ప్రస్తుత తరుణంలో రాజకీయాలపై ఇష్టన్నీ, బాధ్యతను గుర్తించిన యువత ఈసారి జరగనున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించునున్నారు. గ్రామ అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. ప్రశ్నించే గొప్ప తత్వాన్ని అలవర్చుకొని, ప్రజాసేవలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డబ్బు, మద్యం లేని ఈ రాజకీయాల్లో రాణిస్తారో, లేదో!
News December 9, 2025
మెదక్ : సభలు, ర్యాలీలపై నిషేధం: కలెక్టర్

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్కు 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులోకి రానుంది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.


