News February 1, 2025
MDK: యువతితో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
మెదక్ పోలీస్ పరేడ్.. అదనపు ఎస్పీ సమీక్ష

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పరేడ్‌కు అదనపు ఎస్పీ మహేందర్ హాజరయ్యారు. పోలీసుల క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, డ్రెస్ కోడ్‌ను ఆయన సమీక్షించారు. పరేడ్‌లు సిబ్బందిలో ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్‌ను పెంచుతాయని పేర్కొన్నారు.
News September 20, 2025
వారంలోనే అన్నదమ్ముల మృతి.. నిజాంపేటలో విషాదం

తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న గుండెపోటుతో మరణించిన ఘటన నిజాంపేట మండలంలో విషాదం నింపింది. 15 రోజుల క్రితం మహమ్మద్ జాన్ మియా(87) చనిపోగా, ఆ బాధతో ఆయన అన్న మహమ్మద్ షాబుద్దీన్(90) శుక్రవారం మృతి చెందారు. వీరి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
News September 19, 2025
మెదక్: 22 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

మెదక్ పట్టణంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.రాధాకిషన్ తెలిపారు. బాలికల పాఠశాలలో పదో తరగతి, బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పదో తరగతికి 194 మంది, ఇంటర్‌కు 524 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.