News February 1, 2025

MDK: యువతితో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News April 20, 2026

జూన్/జులైలో MPTC, ZPTC ఎన్నికలు?

image

TG: MPTC, ZPTC ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. గతంలో మే నెలలోనే జరపాలని అనుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు జనాభా గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈలోగా ఓటర్ల జాబితా సవరణ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో యంత్రాంగం బిజీగా ఉంది.

News April 20, 2026

ఆల్కహాల్ అలవాటు లేకపోయినా లివర్ సమస్యలు.. ఎలా?

image

ఆల్కహాల్ అలవాటులేని వారికి లివర్ ప్రాబ్లమ్స్ రావనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య సిటీల్లో చాలామంది ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ (NAFLD) బారిన పడుతున్నారు. గంటల తరబడి కూర్చొని ఉండటం, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతోంది. బరువు తక్కువగా ఉన్నా ఈ సమస్య రావొచ్చు. దీన్ని ‘లీన్ ఫ్యాటీ లివర్’ అంటారు. వాకింగ్, మంచి ఆహారంతో ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

News April 20, 2026

ఇండియా ఆఫర్‌ను తిరస్కరించా: రషీద్ ఖాన్

image

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్‌షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్‌షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.