News February 1, 2025
MDK: యువతితో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News October 21, 2025
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధుల్లో అమరులైన పోలీసులకు ఎస్పీ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
News October 21, 2025
పార్వతీపురం: ‘అమరవీరుల త్యాగాలు మరువలేనివి’

పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో వారు పాల్గొన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎన్నో సమస్యలు ఎదుర్కొని అంకితభావంతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా విధుల్లో మృతిచెందిన అమరవీరులకు స్థూపం వద్ద నివాళులర్పించారు.
News October 21, 2025
రౌడీ షీటర్ దాడికి పాల్పడ్డాడని మహిళ SUICIDE

రౌడీ షీటర్ తనపై దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రఘునాథపాలెం(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. జగ్యా తండాకు చెందిన బోడ సుశీల(26) అనే మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(రౌడీ షీటర్) దాడికి పాల్పడడంతో మనస్థాపానికి చెందిన సుశీల ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఉరి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాలి.